హైకోర్టులో IAS అధికారుల లంచ్ మోషన్ పిటిషన్
డీవోపీటీ బదిలీ చేసిన ఐఏఎస్ అధికారులు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రొనాల్డ్ రోస్, సృజన, శివశంకర్, హరికిరణ్, ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్.. డీవోపీటీ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల వీరంతా తమను బదిలీ చేయకుండా ఉంచాలని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (CAT)ను ఆశ్రయించారు. వారి విజ్ఞప్తిని అక్కడ నిరాకరించడంతో బుధవారం హైకోర్టులో పిటిషన్ వేసి అత్యవసరంగా విచారించాలని కోరారు.