గుడిలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న అర్చకులు (వీడియో)
AP: తిరుపతి జిల్లా తలకొనలోని శ్రీసిద్దేశ్వరస్వామి ఆలయంలో ఇద్దరు అర్చకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ గుడిలో రద్దీ సమయంలో మరో పరిచారకుడి అవసరం ఉంది. ఈ క్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఫోర్జరీ సంతకంతో తన కుమారుడికి నియమించారని మరో అర్చకుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీని కారణంగా వారి మధ్య ఈ గొడవ జరిగినట్లుసమాచారం. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.