పోలీసులకు వైసీపీ అధినేత జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ల అరెస్టుల వ్యవహారంలో పోలీసుల తీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటాం. ఎవర్ని వదిలిపెట్టం. అవసరమైతే చట్టప్రకారం కోర్టుకెక్కుతాం. జమిలి గిమిలి అంటున్నారు. ఇది నాలుగేళ్ల ప్రభుత్వమే. ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వం. అప్పుడు రిటైర్డ్ అయిన పోలీసులను సైతం వదిలిపెట్టం.’ అని జగన్ అన్నారు.