HYD: హైదరాబాదులోని కేపీహెచ్బీలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తుండగా ఓ యువకుడికి గుండెపోటు వచ్చింది. అస్వస్థతకు గురైన యువకుడు విష్ణువర్ధన్ (31)ను భక్తులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటన సంబంధించిన దృశ్యాలు, సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.