నెల్లూరు రూరల్ పరిధిలోని 17వ డివిజన్ వడ్డీ పాలెం వద్ద రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారిని ఇరిగేషన్ అధికారులు వారిని తొలగించాలని బెదిరిస్తున్నారని, ఈ విషయమై మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణను మంగళవారం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాదాల వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. వారిని కలిసిన వారిలో సిపిఎం నాయకులు కృష్ణయ్య, కే. కుమార్, కట్టా సతీష్ పాల్గొన్నారు.