BSNL కస్టమర్లకు గుడ్న్యూస్
కస్టమర్లకు ప్రభుత్వ రంగ సంస్థ BSNL శుభవార్త చెప్పింది. ప్రైవేట్ టెలికం ఆపరేటర్లతో పోలిస్తే BSNL టారిఫ్ రేట్లు చాలా తక్కువగా ఉండడంతో చాలా మంది వినియోగదారులు అందులోకి పోర్ట్ అయ్యారు. ఆఫర్లు బాగున్నా సిగ్నల్ చాలా ఇబ్బంది పెడుతోందని ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో BSNL కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 65వేలకు పైగా 4G టవర్లు పని చేస్తున్నాయని పేర్కొంది. జూన్ వరకు వీటిని లక్షకు పెంచుతామని తెలిపింది.