జమ్మూకశ్మీర్‌లో 200 మంది క్వారంటైన్‌ కేంద్రాలకు తరలింపు

79చూసినవారు
జమ్మూకశ్మీర్‌లో 200 మంది క్వారంటైన్‌ కేంద్రాలకు తరలింపు
జమ్మూకశ్మీర్‌ రాజౌరీలోని బధాల్‌ గ్రామంలో మిస్టరీ మరణాలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ముందుస్తు జాగ్రత్తగా దాదాపు 200 మందిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. బాధిత కుటుంబాలతో తరచూ కలుస్తుండే వారితో పాటు అంత్యక్రియల్లో పాల్గొన్న వారిని.. ముందు జాగ్రత చర్యలో భాగంగా క్వారంటైన్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, బధాల్‌ గ్రామంలో నెలన్నర వ్యవధిలో 17 మంది అనూహ్యరీతిలో ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత పోస్ట్