వైసీపీ మాజీ మంత్రి తనయుడి అరెస్ట్?
రెండేళ్ల క్రితం జరిగిన దళిత యువకుడి హత్య కేసులో వైసీపీ మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ తనయుడు పినిపె శ్రీకాంత్‌ను పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం. తమిళనాడులోని మదురైలో ఉన్న శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసి అక్కడ న్యాయమూర్తి ముందు హాజరుపరిచినట్లు తెలుస్తోంది. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ఏపీ పోలీసులు ఆయన్ను కస్టడీకి తీసుకున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట డీఎస్పీ ముందు హాజరుపరిచి విచారించనున్నారు.