బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడనున్న అల్పపీడనం.. మంగళవారం నాటికి వాయుగుండంగా మారనుంది. బుధవారం నాటికి తుఫాన్‌గా రూపాంతరం చెందుతుందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావం ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలపైనే ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తోంది. అల్పపీడనం ప్రభావంతో గురువారం నుంచి శనివారం వరకు ఉత్తరకోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.