పోస్టింగ్‌కు వెళ్తుండగా ప్రమాదం.. యువ ఐపీఎస్ మృతి
ఐపీఎస్ ఉద్యోగం సాధించాలంటే ఎంతో కష్టపడాలి. అలాంటి ఎన్నో కలలు, ఎంతో కృషి, పట్టుదల తర్వాత హర్షవర్దన్ (26) అనే యువకుడు ఐపీఎస్ ఉద్యోగం సాధించాడు. మైసూరులో ట్రైనింగ్ పూర్తి చేసుకుని కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో పోస్టింగ్ తీసుకునేందుకు బయలుదేరారు. అయితే తాను వెళ్తున్న వాహనం టైర్ పేలింది. దాంతో వాహనం చెట్టును ఢీకొట్టగా.. హర్షవర్దన్ తలకు బలమైన గాయమైంది. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.