హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' చిత్రం నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా ఈ చిత్రంలో కనిపించనున్నట్లు మోహన్‌బాబు తెలిపారు. వీరి పుట్టినరోజు సందర్భంగా 'కన్నప్ప'లో వీరికి సంబంధించిన ఫొటోను పంచుకున్నారు. కన్నప్పతో తన మనవరాళ్లు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందిస్తున్నానని తెలిపారు. నటనపై వాళ్లకు ఉన్న అభిరుచి చూసి గర్వంగా ఉందని పోస్ట్ పెట్టారు.