పార్లమెంట్‌లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా సోమవారం రోజు (డిసెంబర్ 2) సభ మొదలవ్వగానే.. అదానీ లంచం ఆరోపణలు, సంభాల్ ఇష్యూ, తమిళనాడు వరదలు, బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు, అజ్మీర్ షరీఫ్ దర్గా అంశంపై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభలను డిసెంబర్ 3కు వాయిదా వేశారు.