ఏపీలో ‘పల్లె పండుగ’.. అప్పటి నుంచే?
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ‘పల్లె పండుగ’ పేరుతో ఈ నెల 14 నుంచి 21 వరకు పల్లె పండుగ కార్యక్రమాలు నిర్వహించనుంది.19,500 రకాల అభివృద్ధి పనులను దశలవారీగా ప్రభుత్వం పూర్తి చేయనుంది.