ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తమిళనాడులోని మదురైలో వంచినాథన్ అనే అడ్వకేట్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు జాతీయ మీడియా ఓ కథనంలో తెలిపింది. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధిపై, మైనార్టీలపై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని వంచినాథన్ ఆరోపించినట్లు పేర్కొంది. మత కల్లోలం సృష్టించే విధంగా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొనట్లు తెలిపింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు పేర్కొంది.