యువతి హత్య.. స్నేహితుడే ప్రాణం తీశాడు

67చూసినవారు
యువతి హత్య.. స్నేహితుడే ప్రాణం తీశాడు
హైదరాబాద్ మియాపూర్‌ లో గతనెల 30న సంచలనం సృష్టించిన యువతి స్పందన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. భర్తతో మనస్పర్థలు రావడంతో స్పందన తల్లితో కలిసి ఇంటి వద్దే ఉంటోంది. ఒంటరిగా ఉంటున్న ఆమెకు దగ్గరయ్యేందుకు చిన్ననాటి స్నేహితుడు ఏలూరుకు చెందిన మనోజ్‌ కుమార్‌(బాలు) ప్రయత్నించాడు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడగా ఆమె అంగీకరించలేదు. దీంతో హత్య చేయాలని భావించి.. ఆమె ఇంట్లో ఒంటరిగా వచ్చి గ్రానైట్‌ రాయితో తలపై మోదాడు. స్కూడ్రైవర్‌తో మొహంపై దాడి చేసి హత్య చేశాడు.

సంబంధిత పోస్ట్