నేడు ఢిల్లీకి బయలుదేరనున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు కర్ణాటక నుంచి బయలుదేరి ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థీవ దేహానికి ముఖ్యమంత్రి నివాళులర్పించనున్నారు. అనంతరం ఇవాళ సాయంత్రం తిరిగి ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రానున్నారు.