అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాజ్ టోపీ పెట్టిన వ్యక్తి అరెస్ట్

56చూసినవారు
అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాజ్ టోపీ పెట్టిన వ్యక్తి అరెస్ట్
AP: తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాజ్ టోపీ పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి తూర్పు పోలీసులు తిరుచానూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మహారాష్ట్ర పర్బాని తాలూకా ఫెడ్గోన్‌కు చెందిన బంధు ధార్జి జవనార్‌గా గుర్తించారు. అతను హిందువని, దేశంలోని ఆలయాలు తిరుగుతుంటారని పోలీసులు తెలిపారు. దర్యాప్తు జరుగుతోందన్నారు.

సంబంధిత పోస్ట్