ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతి (వీడియో)
TG: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మోటకొండూరు మండలంలో విద్యుత్ శాఖ ఉపయోగించే ట్రాక్టర్ ఢీకొని నవీన్ అనే యువకుడు శనివారం అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ క్రమంలో మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.