‘నా జీవితాన్ని ఇంకా నాశనం చేయాలని వాళ్లు చూస్తున్నారు’ అని లక్ష్మి పార్వతి ఆరోపించారు. NTR ఘాట్‌లో నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. ‘నా భర్త NTR ఎలా చనిపోయారో, ఎన్ని కుతంత్రాలు జరిగాయో నాకు తెలుసు. 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా. ఇప్పటికీ ఆ దుర్మార్గుల అరాచకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. అందరి సమక్షంలోనే ఎన్టీఆర్ నన్ను పెళ్లి చేసుకున్నారు. ఏ పదవి ఆశించకుండా నిస్వార్ధంగా పని చేశాను’ అని ఆమె అన్నారు.