బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో ఆయన భార్య కరీనా కపూర్ స్టేట్‌మెంట్‌ను ముంబై పోలీసులు నమోదు చేశారు. దుండగుడు సైఫ్‌ను చాలా సార్లు పొడిచాడని కరీనా తెలిపారు. అయితే ఇంట్లో ఎలాంటి నగదు, ఆభరణాలు చోరీ చేయలేదని పోలీసులకు వెల్లడించారు. కాగా ప్రస్తుతం సైఫ్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.