మాజీ ప్రియరాలితో రతన్ టాటా.. అరుదైన వీడియో
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఇక లేరనే విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. రతన్ టాటాకు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన మాజీ ప్రేయసి, బాలీవుడ్ నటి సిమి గరెవాల్ సంతాపం తెలిపారు. 'ఇక నువ్వు లేవని అంటున్నారు. ఇది భరించలేనిది. వీడ్కోలు నేస్తమా' అని ఆమె ట్వీట్ చేశారు. కాగా, వీరిద్దరూ విడిపోయినట్లు 2011లో హిందుస్థాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో సిమి చెప్పారు.