తిరుమలలో సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు (వీడియో)

62చూసినవారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొసాగుతున్నాయి. గురువారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై బద్రి నారాయణుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్