నమీబియా తొలి మహిళా అధ్యక్షురాలిగా నెటుంబో నంది నందైత్వా
నమీబియా తొలి మహిళా అధ్యక్షురాలిగా నెటుంబో నంది నందైత్వా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 90 శాతం కంటే ఎక్కువ ఓట్లు లెక్కించినట్లు తెలిపింది. కాగా, 72 ఏళ్ల నంది నందైత్వా 57 శాతం ఓట్లు సాధించారు. ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ.. శాంతి, స్థిరత్వానికి ప్రజలు ఓటు వేశారని పేర్కొన్నారు.