6 నుంచి రెవెన్యూ సదస్సులు

57చూసినవారు
6 నుంచి రెవెన్యూ సదస్సులు
AP: ఈ నెల 6 నుంచి జనవరి 8 వరకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించనుంది. గ్రామస్థాయిలో భూ వివాదాలను ఈ సమావేశాల్లో పరిష్కరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భూ ఆక్రమణలు, 22ఏ, ఫ్రీహోల్డ్‌పై ఫిర్యాదులు స్వీకరించనుంది. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో షెడ్యూల్ ప్రకటించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్