భూ ప్రకంపనలు.. గోదావరి పరివాహక ప్రాంతాల్లోనే ఎందుకంటే?

79చూసినవారు
భూ ప్రకంపనలు.. గోదావరి పరివాహక ప్రాంతాల్లోనే ఎందుకంటే?
గోదావరి పరివాహక ప్రాంతాల్లో అప్పుడప్పుడు భూమి కంపించే ఛాన్స్ ఉందని నిపుణులు చెప్తున్నారు. 'గోదావరి పరివాహక ప్రాంతాలైన పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల వెంట ఫాల్ట్ లైన్ ఉంటుంది. GSI ప్రకారం ఈ ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చే అవకాశం మధ్యస్థంగా ఉంది. ఏప్రిల్ 13,1969న భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతంలోని ఫాల్ట్ లైన్ కారణంగా 5.7 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది' అని తెలిపారు.

సంబంధిత పోస్ట్