'బలగం' మూవీ ఫేమ్ మొగిలయ్య మృతి
జానపద కళాకారుడు, 'బలగం' మూవీ ఫేమ్ మొగిలయ్య కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇటీవల వరంగల్ లోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించి ఇవాళ ఉదయం చనిపోయారు. 'బలగం' సినిమాలోని చివరి సన్నివేశంలో భావోద్వేగభరిత పాటను ఆలపించి కంటతడి పెట్టించిన మొగిలయ్య అందరి మన్ననలు పొందారు. కాగా మొగిలయ్య స్వగ్రామం వరంగల్ జిల్లా దుగ్గొండి.