Top 10 viral news 🔥
సైఫ్ ఫిట్‌గా ఉండటంపై అనుమానాలు.. డాక్టర్ స్టాంగ్ కౌంటర్
సైఫ్ అలీఖాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఎంతో ఫిట్‌గా కనిపించడంపై శివసేన సంజయ్ నిరుపమ్, కొందరు డాక్టర్లు అనుమానం వ్యక్తం చేశారు. దీనిని ప్రముఖ వైద్యుడు దీపక్ కృష్ణమూర్తి ఖండించారు. 'సైఫ్‌ను అనుమానించడం చూస్తుంటే నవ్వొస్తుంది. వెన్నెముక ఆపరేషన్ జరిగిన ఒక్క రోజులోనే నడవొచ్చు. మా 78 ఏళ్ల అమ్మనే సర్జరీ తర్వాత వాకర్‌తో నడిచింది. ఆయన లాంటి ఫిట్‌గా ఉండే వ్యక్తి రికవర్ కాలేరా?' అని కౌంటర్ ఇచ్చారు.