AP: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన ఆర్మీ జవాన్‌కు ఇవాళ కన్నీటి వీడ్కోలు పలికారు. చిత్తూరు జిల్లా బంగారు పాల్యం మండలం రాగిమానుపెంట గ్రామానికి జవాన్ పంగల కార్తీక్ మృతదేహం గ్రామానికి చేరుకుంది. ఎమ్మెల్యే మురళీమోహన్, పలువురు నాయకులు భౌతికకాయానికి నివాళులర్పించారు. తల్లిదండ్రులు వరదరాజులు యాదవ్, సెల్వికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జవాన్ మృతికి సంతాపంగా పాఠశాల విద్యార్థుల ర్యాలీ చేపట్టారు.