గొట్టా బ్యారేజ్ ఎడమ కాలవలపై నిర్మాణాలు చేపట్టండి

53చూసినవారు
పాతపట్నం మండలంలోని హిరమండలం వద్ద వంశధార నదిపై ఉన్న గొట్ట బ్యారేజ్ ఎడమ ప్రధాన కాలువ పై మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా పరిషత్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎడమ కాలువపై ఆనుకుని ఉన్న 5 వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయని సభ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్