ఈనెల 9న జిల్లాకు చంద్రబాబు రాక

68చూసినవారు
ఈనెల 9న జిల్లాకు చంద్రబాబు రాక
టీడిపి అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 9న శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. ఆరోజు నరసన్నపేట నియోజకవర్గంలో జరిగే ప్రజాగళం సభలో పాల్గొననున్నారు. విజయవాడ నుంచి 9న ఉదయం 11 గంటలకు నరసన్నపేట చేరుకుంటారని, అనంతరం చీపురుపల్లి వెళ్తారని ఆ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కలమట వెంకట రమణ శనివారం తెలిపారు.