హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ కసరత్తు ప్రారంభించింది. నగరంలో అక్కడక్కడా సిగ్నలింగ్ వ్యవస్థలో ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించింది. వాటిని వెంటనే పరిష్కరించాలని భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్‌కు సూచించింది. నగరంలో మరిన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు నిర్మిస్తే చాలావరకూ సమస్యను అధిగమించొచ్చని పేర్కొంది. కాగా, త్వరలో అందుబాటులోకి రానున్న కమాండ్ కంట్రోల్ టవర్స్ జీహెచ్‌ఎంసీతో అనుసంధానం కానుంది.