108వాహనంలో గర్భిణీ ప్రసవం
మెళియాపుట్టి మండలం సంతోష్ పురం గ్రామానికి చెందిన సవర యశోద (28) అనే గర్భిణీ శనివారం 108 వాహనంలో ప్రసవం జరిగింది. 108లో చికిత్స కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో ముక్తాపురం సమీపంలో నొప్పులు ఎక్కువ కావడంతో ఇఆర్సీపి వైద్యాధికారి కుమార్ రాజ సలహాలతో ప్రసవం చేయగా మగ బిడ్డకు జన్మించింది. శ్రీనివాసరావు బిడ్డకు ప్రథమ చికిత్స అందించి తల్లి, బిడ్డని కరజాడ పిహెచ్సిలో చేర్పించారు. 108 సిబ్బందికి పలువురు అభినందించారు.