రైలు కింద దూకి ఆటో డ్రైవర్ ఆత్మహత్య

54చూసినవారు
రైలు కింద దూకి ఆటో డ్రైవర్ ఆత్మహత్య
ఏపీలోని నంద్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సలీమ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఫరూక్ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తుంటాడు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఫరూక్.. రైల్వే స్టేషన్‌లో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ కింద దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు కాళ్లు తెగి పది నిమిషాల సేపు మృత్యువుతో పోరాడి చనిపోయాడు. మృతుడు ఫరూక్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని రైల్వే పోలీసులు నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్