మహారాష్ట్రలో సీఎం షిండే వర్గం శివసేన ఎమ్మెల్యే శ్రీనివాస్ వనగ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఉద్ధవ్ థాక్రే వర్గం నుంచి షిండే వర్గంలోకి వెళ్లిన ఆయనకు ప్రస్తుత ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పాల్ఘర్ అసెంబ్లీ స్థానానికి రాజేంద్ర గవిట్ను అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. దీంతో సీఎం షిండేపై ఎమ్మెల్యే శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. తర్వాత ఆయన జాడ తెలియలేదు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.