తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు చోట్ల మూడు హత్యలు

61చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు చోట్ల మూడు హత్యలు
తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు చోట్ల మూడు హత్యలు జరిగాయి. తెలంగాణలోని మెదక్ జిల్లా శివంపేట మండలం నానూ తండాలో అన్న శంకర్‌ను తమ్ముడు గోపి విద్యుత్ షాకిచ్చి చంపాడు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తాపీ మేస్త్రి షేక్ నాగుల్ మీరా (36) హత్యకు గురయ్యారు. స్నేహితులతో ఘర్షనే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. చిత్తూరు జిల్లా పులిచర్ల మండలంలో పొలం తగాదాల వల్ల ప్రభాకర్ రెడ్డి అనే రైతు హత్యకు గురయ్యారు.