
కోవూరు: యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయండి
ఎస్సీ, ఎస్టీల వెనుకబాటుతనం పై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అసెంబ్లీలో గళమిప్పారు. కోవూరు నియోజకవర్గంలోని దళిత, గిరిజన సమస్యలను ఆమె సోమవారం శానసభలో ప్రస్తావించారు. కోవూరు నియోజకవర్గంలో ఉన్న 138 గిరిజన కాలనీలలో దాదాపు 30 వేల వరకు గిరిజనులు ఉన్నారని వారిలో 90 శాతానికి పైగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని గిరిపుత్రల దయనీయ జీతాలను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సభ దృష్టికి తెచ్చారు.