
రాపూరు: తూటా తగిలి యువకుడు మృతి
రాపూరు పరిధి పెనుబర్తి అటవీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు నాటు తుపాకీ పేలి సుధాకర్ అనే గిరిజన యువకుడు మృతి చెందారు. శివ, సుధాకర్, మణి వన్యప్రాణులను వేటాడేందుకు శనివారం రాత్రి అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. వన్యప్రాణి కనిపించడంతో మణి తన వద్ద ఉన్న నాటు తుపాకీతో కాల్చారు. సుధాకర్‌కు తూటా తగలడంతో తీవ్ర గాయమై ఆసుపత్రికి తరలించకుండా అడవిలోనే ఉండి ఆదివారం ఉదయం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. కేసు నమోదైంది.