పింఛన్ తీసుకునే వారికి అలర్ట్
AP: ఇవాళ్టి నుంచి ఏపీలో అధికారులు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. జనవరి 1న న్యూఇయర్ కావడంతో ఆ రోజు పింఛన్ అందించడం కుదరదు. దాంతో ఒక రోజు ముందుగానే అధికారులు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఒకవేళ ఇవాళ పింఛన్ తీసుకోని వారు ఉంటే జనవరి 2న తీసుకోవచ్చు. అలాగే స్పౌజ్ కేటగిరి కింద కొత్తగా 5,402 మందికి రూ.4 వేల పింఛన్ అందజేయనున్నారు. రెండు నెలల పాటూ పింఛన్ తీసుకోని వారు.. మూడో నెలలో కలిపి పింఛన్ తీసుకోవచ్చని ప్రభుత్వం గతంలో తెలిపింది.