AP: రాష్ట్రంలో పారిశ్రామిక, ఇంధన రంగాల్లో రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాటి ద్వారా 2,63,411 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రానికి పెట్టుబడులతో వస్తున్న సంస్థలకు అవసరమైన భూములు, మౌలిక సదుపాయాలను వేగంగా కల్పించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఒప్పందం ప్రకారం నిర్దిష్ట సమయంలో ప్రాజెక్టులు పూర్తి చేసేలా పర్యవేక్షించాలని సూచించారు.