స్పేడెక్స్‌ ప్రయోగం విజయవంతం.. కక్ష్యలోకి ఛేజర్‌, టార్గెట్‌

78చూసినవారు
స్పేడెక్స్‌ ప్రయోగం విజయవంతం.. కక్ష్యలోకి ఛేజర్‌, టార్గెట్‌
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన వాహకనౌక.. టార్గెట్‌, ఛేజర్‌ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ రెండు ఉపగ్రహాల బరువు 440 కిలోలు. రెండు ఉపగ్రహాలను అంతరిక్షంలోనే డాకింగ్‌, అన్‌డాకింగ్‌ చేసేలా ప్రయోగాన్ని చేపట్టారు. వృత్తాకార కక్ష్యలో 2 ఉపగ్రహాలను ఏకకాలంలో డాకింగ్‌ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

సంబంధిత పోస్ట్