భోగి పండుగ రోజున ఏం చేస్తారో తెలుసా..?
భోగి పండుగ రోజున ఉదయం నుంచి సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేలోగా ఎనిమిది సంవత్సరాల వయసులోపు బాలబాలికలకు భోగి పళ్లు పోయాలి. ఉదయం ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టాలి. మధ్యాహ్నం వేళ బొమ్మల కొలువు పెట్టాలి (ఇది ఆనవాయితీ ఉన్నవాళ్లు మాత్రమే చేస్తారు). నువ్వులు అద్దిన సజ్జరొట్టెలు భోజనంలో తప్పకుండా ఉండాలి. ఈ రోజు గుమ్మడికాయ దానమిస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తాయని ధర్మప్రవృత్తి అనే గ్రంథం స్పష్టం చేస్తోంది.