చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు
AP: వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గతంలో బాలికపై అత్యాచారం జరిగిందని అసత్య ప్రచారం చేశారని ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు తిరుపతి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో తాజాగా శుక్రవారం కోర్టు చెవిరెడ్డి పిటిషన్‌ను కొట్టివేసింది.