మన్ కీ బాత్ తరహాలో ఏపీ ప్రజల ముందుకు సీఎం చంద్రబాబు
ప్రధాని మోదీ నిర్వహిస్తున్న 'మన్‌కీ బాత్' తరహాలోనే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక కార్యక్రమం ద్వారా నేరుగా ఏపీ ప్రజలతో ముఖాముఖీ మాట్లాడబోతున్నారు. ఆడియో, వీడియో రూపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ప్రజలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నట్లు బుధవారం అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ప్రకటించారు. సంక్రాంతి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.