చిరుతను చంపి.. వండుకుని తిన్న వేటగాళ్లు

560చూసినవారు
చిరుతను చంపి.. వండుకుని తిన్న వేటగాళ్లు
ఒడిశాలోని నువాపాడా జిల్లా దేవ్‌ధార గ్రామ సమీపంలో చిరుతపులిని వేటాడిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈనెల 16న అడవి పందులను పట్టుకునేందుకు నలుగురు వేటగాళ్ళు అడవిలో ఉచ్చు వేశారు. ఆ వలలో చిరుతపులి చిక్కుకుంది. వేటగాళ్ళు చిరుతపులిని చంపి, దాని చర్మం తీసి, మాంసాన్ని వండుకుని తిన్నారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేయగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్