భారీ వర్షాలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. కోసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. కల్లాల్లోని పంట ఉత్పత్తులు తడవకుండా రైతులకు టార్పిలిన్లు అందజేయాలని తెలిపారు. వరి కోతల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకునేలా వ్యవసాయ శాఖ ద్వారా అన్నదాతలకు అవగాహన కల్పించాలన్నారు.