తిరుగుబాటుదళాలు సిరియా రాజధాని డమాస్కస్‌ను ఆక్రమించుకోవడంతో అధ్యక్షుడు బషర్-అల్-అసద్ దేశాన్ని విడిచివెళ్లారు. తన కుటుంబసభ్యులతో కలిసి రష్యాకు చేరినట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. అసద్‌కు రష్యా ఆశ్రయం కల్పించినట్లు తెలిపాయి. ''సిరియా అధ్యక్షుడు అసద్ తన కుటుంబంతో సహా మాస్కోకు చేరుకున్నారు. మానవతా సాయం కోణంలో రష్యా ఆయనకు ఆశ్రయం కల్పించింది'' అని విశ్వసనీయ వర్గాలు మీడియాకు సమాచారమిచ్చాయి.