యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని కాల్ వస్తే జాగ్రత్త

78చూసినవారు
యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని కాల్ వస్తే జాగ్రత్త
AP: తమ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే షేర్ మార్కెట్ ట్రేడింగ్ టిప్స్ చెప్తామని, లాభాలు చూపిస్తామంటూ కాల్స్ వస్తే నమ్మొద్దని విజయవాడ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ మోసాల బారిన పడితే వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు. అలాగే అధికారుల, బ్యాంకుల పేరుతో వచ్చే వీడియో కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు. మోసపూరితమైన వీడియో కాల్స్, మెసేజ్‌లకు దూరంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్