మంచు ఫ్యామిలీలో విబేధాలు చర్చనీయాంశంగా మారాయి. మోహన్ బాబు తన ముగ్గురు పిల్లలకు ఆస్తులు పంచినట్లు తెలుస్తోంది. విద్యాసంస్థల్లో వాటాపై మంచు మనోజ్ అసంతృప్తిగా ఉన్నారట. ఈ అంశంపైనే శనివారం రాత్రి మోహన్ బాబు ఇంట్లో భేటీ అయ్యారు. అప్పుడు గొడవ జరగడంతో మోహన్ బాబు అనుచరుడు విజయ్.. మంచు మనోజ్‌పై దాడి చేసినట్లు సమాచారం. దాంతో అతను ఫోన్ చేయడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కాంప్రమైజ్ అయినట్లు తెలుస్తోంది.