అంతరిక్షంలో జీవం మొలకెత్తింది: ఇస్రో
ఇస్రో మరో అద్భుత ఘనత సాధించింది. ‘కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ (క్రాప్స్)పేరిట పీఎస్ఎల్వీ-సీ 60 రాకెట్లో ఇస్రో ఓ పేలోడ్‌ను అంతరిక్షంలోకి పంపింది. అందులో 8 అలసంద విత్తనాలను ఉంచింది. ప్రయోగం చేపట్టిన తర్వాత నాలుగు రోజుల్లో అవి మొలెత్తినట్లు తాజాగా ఇస్రో వెల్లడించింది. 'అంతరిక్షంలో జీవం మొలకెత్తింది' అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చింది. త్వరలో ఆకులు కూడా వస్తాయని పేర్కొంది.