పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు సూచనతో పోలవరం నిర్వాసితులకు నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులున్నా, పోలవరం నిర్వాసితులకు సీఎం చంద్రబాబు అండగా ఉంటారన్నారు. నిర్వాసితులకు రూ.1,000 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అన్నారు.